రామ్ సినిమాలో హెబ్బా స్పెషల్ సాంగ్
ABN , First Publish Date - 2020-03-04T19:38:16+05:30 IST
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రెడ్’. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రెడ్’. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుంది. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఓ పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్‌లో హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తుంది. ఈ పాట కోసం మేకర్స్ స్పెషల్ సెట్‌ను వేశారు. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. మాళవికా శర్మ, అమృత అయ్యర్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
Read more