హన్సిక బికినీ ట్రీట్ ఇవ్వనుందా?

ABN , First Publish Date - 2020-07-31T17:10:50+05:30 IST

తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక.

హన్సిక బికినీ ట్రీట్ ఇవ్వనుందా?

తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ హన్సిక. ముఖ్యంగా తమిళంలో ఆమెకు పాపులారిటీ చాలా ఎక్కువ. చాలా సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్‌గా మెప్పించిన హన్సిక ఇప్పటివరకు తెరపై బికినీ ధరించలేదు. త్వరలో హన్సిక ఆ లోటు కూడా తీర్చబోతోందట. 


తన 50వ సినిమాలో హన్సిక స్విమ్‌సూట్‌లో కనిపించనుందట. ఈ మేరకు లాక్‌డౌన్ సమయంలో హన్సిక పూర్తి ఫిట్‌నెస్ సాధించిందట. బికినీలో కనిపించేందుకు అవసరమైన శరీరాకృతిని సంపాదించిందట. హన్సిక 50వ సినిమా `మహా`. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే విడుదలై సంచలనంగా మారాయి. కాషాయం ధరించి పొగ తాగుతున్న హన్సిక ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదే సినిమాలో హన్సిక బికినీలో కూడా మెరవనుందన్నమాట.  

Updated Date - 2020-07-31T17:10:50+05:30 IST