ఆ ఛాన్స్ పూజకేనా?

ABN , First Publish Date - 2020-10-12T17:42:46+05:30 IST

దగ్గుబాటి రానా హీరోగా దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం `హిరణ్య కశ్యప` ఇప్పట్లో పట్టాలెక్కదని తేలిపోయింది.

ఆ ఛాన్స్ పూజకేనా?

దగ్గుబాటి రానా హీరోగా దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం `హిరణ్య కశ్యప` ఇప్పట్లో పట్టాలెక్కదని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితులన్నీ సర్దుకున్నాకే ఆ సినిమా ఉంటుందని గుణశేఖర్ ఇటీవల స్పష్టం చేశారు. ఈ లోపు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 


ప్రముఖ కవి కాళిదాసు రచన ఆధారంగా `శాకుంతలం` సినిమాను తెరకెక్కించబోతున్నారు. మణిశర్మ మ్యూజిక్‌‌తో తాజాగా విడుదలైన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డేను గుణశేఖర్ సంప్రదించబోతున్నట్టు సమాచారం. పూజని కలిసి కథ చెప్పాలని గుణశేఖర్ అనుకుంటున్నారట. ఆమె అంగీకరించకపోతే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను సంప్రదించనున్నారట. మరి, ఈ పాత్రను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.   


Updated Date - 2020-10-12T17:42:46+05:30 IST

Read more