పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ ఫిల్మ్ టైటిల్ అదేనా?

ABN , First Publish Date - 2020-05-13T03:38:01+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వకీల్‌సాబ్’ చిత్రం చాలా వరకు

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ ఫిల్మ్ టైటిల్ అదేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలపై కూడా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘వకీల్‌సాబ్’ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. కానీ కరోనా కారణంగా లాక్‌డౌన్ ఏర్పడటంతో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి. తిరిగి షూటింగ్స్‌కు అవకాశం రాగానే మళ్లీ ఇవి రెగ్యులర్ షూట్‌కి వెళ్లనున్నాయి. ఇక ఈ రెండు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో కూడా ఓ చిత్రం చేసేందుకు పవన్ అంగీకారం తెలిపారు. ఇది వారు అఫీషియల్‌గా కూడా ప్రకటించారు.


అయితే పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ వచ్చింది. ఈ కాంబోలో మళ్లీ మూవీ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనవసరం లేదు. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఆ సినిమా ట్యాగ్‌పై అభిమానులు రికార్డులు నెలకొల్పారు. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపిన హరీష్ శంకర్.. ట్విట్టర్‌లో రెండు మూడు సార్లు.. ‘ఇప్పుడే మొదలైంది..’ అంటూ బోల్డ్ లెటర్స్‌లో తెలపడం చూసిన వారంతా.. వీరి కాంబోలో తదుపరి రాబోతున్న చిత్ర టైటిల్ ఇదేనంటూ చెప్పుకుంటున్నారు. ‘గబ్బర్‌సింగ్’లో ఎంతో ఫేమస్ అయిన ఈ డైలాగ్‌తోనే ఇప్పుడు సినిమా రాబోతుందని అప్పుడే సోషల్ మీడియాలో కూడా వార్తలు మొదలయ్యాయి. మరి దీనిపై హరీష్ ఏమంటారో చూడాల్సి ఉంది.

Updated Date - 2020-05-13T03:38:01+05:30 IST