గుణశేఖర్‌ ‘శకుంతల’.. ఈ భామేనా?

ABN , First Publish Date - 2020-12-25T03:58:50+05:30 IST

ఆమె నవ్వితే, అందంగా మెరిసిపోయే వెన్నెల కన్య. అలవోకగా కుర్రాళ్ల మనసుల్ని కాళ్లకు కట్టేసుకునే, వన్నెల కన్య. ఇప్పుడీ వెన్నల వంటి వన్నెలున్న కన్య కాస్తా.. త్వరలో

గుణశేఖర్‌ ‘శకుంతల’.. ఈ భామేనా?

ఆమె నవ్వితే, అందంగా మెరిసిపోయే వెన్నెల కన్య. అలవోకగా కుర్రాళ్ల మనసుల్ని కాళ్లకు కట్టేసుకునే, వన్నెల కన్య. ఇప్పుడీ వెన్నల వంటి వన్నెలున్న కన్య కాస్తా.. త్వరలో వన కన్యగా వేషం కట్టబోతోందట. ఇంతకీ ఎవరా కన్య అనుకుంటున్నారు కదా..! బుట్టబొమ్మ పూజా హెగ్డే. రానాతో 'హిరణ్యకశ్యప' చిత్రాన్ని తెరకెక్కించాల్సిన గుణశేఖర్.. ఆ సినిమా మరికాస్త ఆలస్యం అయ్యేలా కనిపించడంతో.. ఈ గ్యాప్ లో 'శాకుంతలం' సినిమాను తీయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఒక విభిన్నమైన పౌరాణిక ప్రణయగాథగా ఈ సినిమాను రూపొందించనున్నట్లుగా గుణశేఖర్‌ ఇప్పటికే తెలిపారు. విడుదలైన మోషన్‌ పోస్టర్‌ కూడా అదే తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోన్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మొదటి రెండు మూడు నెలల్లోనే 'శాకుంతలం' పట్టాలెక్కించి స్పీడ్ గా చిత్రీకరణ జరపాలని గుణశేఖర్ భావిస్తున్నాడట. ఈ సినిమా కోసం ఆయన హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడోగానీ... నెట్టింట్లో మాత్రం ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.


'శాకుంతలం' సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 'అరవింద సమేత' సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ క్రేజీ మూవీస్ లో నటిస్తోన్న ఈ బుట్ట బొమ్మ... ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇక కొన్నాళ్ల కిందట, లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా సై అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గుణశేఖర్ 'శాకుంతలం'లో నటించేందుకు ఆమె ఓకే చెప్పినట్లుగా టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే, దీనిపై గుణశేఖర్ కానీ.. పూజా హెగ్డే కానీ ఇప్పటి వరకు నోరు మెదపలేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు అనుష్క పేరు వినిపిస్తూ వచ్చింది.. ఇప్పుడు ఒక్కసారిగా పూజా హెగ్డే పేరు వినిపించడంతో ఆమె అభిమానులు మాత్రం పూజానే 'శాకుంతలం'లో చేయాలని బలంగా కోరుకుంటున్నట్లుగా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.Updated Date - 2020-12-25T03:58:50+05:30 IST