‘పుష్ప’ కోసం అడ‌వి సెట్‌..?

ABN , First Publish Date - 2020-06-16T17:53:28+05:30 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

‘పుష్ప’ కోసం అడ‌వి సెట్‌..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ని కేరళ అడవుల్లో చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత గోదావరి జిల్లాల్లో చిత్రీకరించాలని కూడా అనుకున్నారు. అయితే అది కూడా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి చిత్రీకరణ చేయాలని యూనిట్ భావించడం లేదట. అందుకని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ఓ అడవి సెట్ వేసి షూటింగ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2020-06-16T17:53:28+05:30 IST