అఖిల్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌..?

ABN , First Publish Date - 2020-08-04T14:04:23+05:30 IST

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.

అఖిల్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫ‌ర్‌..?

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. సినిమా తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌కు చేరుకుంది. ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుదల కావాల్సిన సినిమా క‌రోనా వైర‌స్ కారణంగా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. సినీ వ‌ర్గాల తాజా స‌మాచారం మేర‌కు ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను దాదాపు ఆరున్న‌ర కోట్ల రూపాయ‌ల‌కు సొంతం చేసుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2020-08-04T14:04:23+05:30 IST