బాలయ్య, బోయపాటి శ్రీను మూవీ బిజినెస్‌ విషయంలో నిజమెంత..?

ABN , First Publish Date - 2020-10-27T21:11:26+05:30 IST

బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా శాటిలైట్‌ హక్కులను ఓ ప్రముఖ ఛానెల్‌ రూ. 11.5కోట్లకు, ప్రముఖ డిజిటల్‌ సంస్థ డిజిటల్‌ హక్కులను రూ.9కోట్లకు దక్కించుకుందని సమాచారం.

బాలయ్య, బోయపాటి శ్రీను మూవీ బిజినెస్‌ విషయంలో నిజమెంత..?

స్టార్‌, హిట్‌ కాంబినేషన్స్‌కు ట్రేడ్‌ వర్గాల్లో ఉన్న క్రేజే వేరు. అలాంటి లేటెస్ట్‌ క్రేజీ మూవీస్‌లో నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను మూవీ కూడా ఉంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌ 29 నుండి కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌ జరుపుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్‌ కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే.. బాలయ్య, బోయపాటి శ్రీను సినిమా శాటిలైట్‌ హక్కులను ఓ ప్రముఖ ఛానెల్‌ రూ. 11.5కోట్లకు, ప్రముఖ డిజిటల్‌ సంస్థ డిజిటల్‌ హక్కులను రూ.9కోట్లకు దక్కించుకుందని సమాచారం. సింహా, లెజెండ్‌ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకనే సినిమా షూటింగ్‌ పూర్తి కాకముందే ఫ్యాన్సీ ఆఫర్‌కు ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు అమ్ముడయ్యాయని టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 


Updated Date - 2020-10-27T21:11:26+05:30 IST