అప్పుడే `ఎఫ్3` డీల్ కుదిరిపోయిందా?

ABN , First Publish Date - 2020-12-18T21:13:18+05:30 IST

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఎంటర్‌టైనర్ `ఎఫ్2`

అప్పుడే `ఎఫ్3` డీల్ కుదిరిపోయిందా?

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఎంటర్‌టైనర్ `ఎఫ్2`. దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా  ప్రారంభమైంది. 


ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే డిజిటిల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడైపోయాయట. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమేజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందట. అలాగే శాటిలైట్ హక్కుల కోసం ఓ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ భారీ ధర చెల్లించిందట. ఈ నెల 23 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.  

Updated Date - 2020-12-18T21:13:18+05:30 IST