బోల్డ్ పాత్ర‌లో ఈషా రెబ్బా..!

ABN , First Publish Date - 2020-06-15T15:58:34+05:30 IST

తెలుగులో కూడా ల‌స్ట్ స్టోరీస్ త‌ర‌హాలో ఓ బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ రూపొందుతోంది. అందులో కియారా అద్వాని చేసిన‌ భ‌ర్త నుండి సంతృప్తి చెంద‌ని ఓ గృహిణి పాత్ర‌లో ఈషా రెబ్బా న‌టిస్తుంద‌ట.

బోల్డ్ పాత్ర‌లో ఈషా రెబ్బా..!

ఓటీటీ మాధ్య‌మానికి ఆద‌ర‌ణ పెరిగిన త‌ర్వాత వెబ్ సిరీస్‌లు విరివిగా వ‌స్తున్నాయి. ఆ క్ర‌మంలో బోల్డ్ కంటెంట్ ఎక్కువ‌గానే ఉంటుంది. అలాంటి బోల్డ్ కంటెంట్‌తో హిందీలో రూపొందిన ఓ వెబ్ సిరీస్ ల‌స్ట్ స్టోరీస్. ఇందులో బాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ తార‌లంద‌రూ న‌టించారు. అందులో కియారా అద్వానీ కూడా ఓ భాగంలో న‌టించింది. ఆమె చేసిన ఆ బోల్డ్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపునే ఇచ్చింది. ఇప్పుడు అలాంటి ఓ బోల్డ్ పాత్ర‌లో తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా న‌టించ‌నుంద‌ట‌. తెలుగులో కూడా ల‌స్ట్ స్టోరీస్ త‌ర‌హాలో ఓ బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ రూపొందుతోంది. అందులో కియారా అద్వాని చేసిన‌ భ‌ర్త నుండి సంతృప్తి చెంద‌ని ఓ గృహిణి పాత్ర‌లో ఈషా రెబ్బా న‌టిస్తుంద‌ట. మ‌రి హిందీ ప్రేక్ష‌కులు ఆద‌రించిన రీతిలో తెలుగు ఆడియెన్స్ ఈ బోల్డ్ కంటెంట్‌ను ఆద‌రిస్తారో లేదో చూడాలి. 

Updated Date - 2020-06-15T15:58:34+05:30 IST