కన్‌ఫ్యూజన్‌లో మాటల మాంత్రికుడు

ABN , First Publish Date - 2020-02-02T02:45:01+05:30 IST

అదేంటి? ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ కదా....ఇంక కన్‌ఫ్యూజన్‌ ఎందుకు? అన్న అనుమానం వస్తోంది కదూ...నిజమే...సినిమా

కన్‌ఫ్యూజన్‌లో మాటల మాంత్రికుడు

అదేంటి? ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్‌ బస్టర్‌ కదా....ఇంక కన్‌ఫ్యూజన్‌ ఎందుకు? అన్న అనుమానం వస్తోంది కదూ...నిజమే...సినిమా సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయితే ఆ సినిమా దర్శకుడి తరువాత సినిమా మీదే అందరి కళ్ళు ఉంటాయి. ఎవరితో? ఎలాంటి సినిమా తీస్తాడని అందరూ ఎదురు చూస్తుంటారు. ఈ పరిస్థితి ఆ దర్శకుడిని కొద్దిగా అయోమయంలో పడేస్తుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌. ఆయన తరువాతి సినిమా ఏ హీరోతో చేస్తారని సినీజనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో త్రివిక్రమ్‌ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదట! ఆయన దృష్టిలో ఇద్దరు బడా హీరోలున్నారు. వారిలో ఎవరితో సినిమా చేస్తే బాగుంటుందన్న కన్‌ఫ్యూజన్‌లో ఆయన ఉన్నారట.

Updated Date - 2020-02-02T02:45:01+05:30 IST