రకుల్‌ను కలిసిన క్రిష్.. పవన్ సినిమా కోసం కాదా?

ABN , First Publish Date - 2020-07-31T00:42:28+05:30 IST

దర్శకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న క్రిష్ మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా దృష్టి సారించారు.

రకుల్‌ను కలిసిన క్రిష్.. పవన్ సినిమా కోసం కాదా?

దర్శకుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న క్రిష్ మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా దృష్టి సారించారు. ఇటీవలె `ఆహా` ఓటీటీ కోసం రచయితగా మారి కథ అందించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల కోసం మరిన్ని కథలు తయారు చేస్తున్నారట. వాటిలో ఒక దాన్ని స్వయంగా తెరకెక్కించబోతున్నారట. 


ఆ వెబ్ సిరీస్ కోసమే ఇటీవల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను క్రిష్ సంప్రదించినట్టు తాజా సమాచారం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ ఓ సినిమా రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసమే రకుల్‌ను క్రిష్ సంప్రదించి ఉంటారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే పవన్-క్రిష్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు లేవని, ఆ లోపు ఓ వెబ్ సిరీస్ రూపొందించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారని, దాని కోసమే రకుల్‌ను సంప్రదించారని తెలుస్తోంది. మరి, ఇందులో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

 

Updated Date - 2020-07-31T00:42:28+05:30 IST