నితిన్ రీమేక్‌కి డైరెక్ట‌ర్ అత‌నేనా?

ABN , First Publish Date - 2020-02-14T22:30:27+05:30 IST

యువ హీరో నితిన్ ఈ నెల 21న `భీష్మ`గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే నితిన్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో `రంగ్‌దే` సినిమాతో పాటు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి కూడా తెలిసిందే.

నితిన్ రీమేక్‌కి డైరెక్ట‌ర్ అత‌నేనా?

యువ హీరో నితిన్ ఈ నెల 21న `భీష్మ`గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే నితిన్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో `రంగ్‌దే` సినిమాతో పాటు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి కూడా తెలిసిందే. ఇవే కాకుండా హిందీలో విజ‌య‌వంత‌మైన చిత్రంలో `అంధాదున్` తెలుగు రీమేక్‌లోనూ నితిన్ హీరోగా న‌టించ‌బోతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను తెలుగులో మేర్ల‌పాక గాంధీ తెర‌కెక్కించ‌బోతున్నార‌ట‌. ఇంత‌కు ముందు `వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌`, `ఎక్స్‌ప్రెస్‌రాజా`, `కృష్ణార్జున యుద్ధం` చిత్రాల‌ను తెర‌కెక్కించాడు మేర్ల‌పాక గాంధీ.  `కృష్ణార్జున‌యుద్ధం` ప్లాప్ కావ‌డంతో మేర్ల‌పాక గాంధీకి అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ఈ త‌రుణంలో నితిన్ ఈ యువ ద‌ర్శ‌కుడికి మ‌రో అవ‌కాశం ఇచ్చాడ‌ని టాక్‌. ఈ చిత్రాన్ని నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ నిర్మించ‌నుంది. 

Updated Date - 2020-02-14T22:30:27+05:30 IST