`ఇండియన్-2` నుంచి శంకర్ తప్పుకోవాలనుకుంటున్నారా?

ABN , First Publish Date - 2020-10-23T21:27:20+05:30 IST

ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందించి దక్షిణాది నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకున్నారు శంకర్.

`ఇండియన్-2` నుంచి శంకర్ తప్పుకోవాలనుకుంటున్నారా?

ఎన్నో అద్భుతమైన సినిమాలు రూపొందించి దక్షిణాది నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకున్నారు శంకర్. అయితే కమల్ ‌హాసన్ హీరోగా ఆయన ప్రారంభించిన `ఇండియన్-2` సినిమా ఆది నుంచీ ఇబ్బందులు పెడుతూనే ఉంది. ప్రారంభంలోనే బడ్జెట్ విషయంలో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో శంకర్ విభేదించారు. కొంత కాలం షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్ రాజీ పడడంతో ప్రారంభమైంది. 


ఆ తర్వాత షూటింగ్ స్పాట్‌లో క్రేన్ యాక్సిడెంట్ జరిగి యూనిట్ మెంబర్స్ చనిపోవడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ ఘటనకు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే కారణమంటూ శంకర్ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కమల్‌హాసన్ కలుగజేసుకోవడంతో వివాదం సద్దుమణిగి షూటింగ్ మళ్లీ మొదలైంది. అంతలో కరోనా వచ్చిపడింది. దీంతో పూర్తిగా ఈ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ సినిమా బడ్జెట్‌ను మరింత తగ్గించాలని నిర్మాణ సంస్థ భావిస్తోందట. శంకర్ మాత్రం అందుకు ఇష్టపడడం లేదట. దీంతో సినిమా షూటింగ్ పున:ప్రారంభం గురించి నిర్మాణ సంస్థ పట్టించుకోవడం మానేసిందట. సినిమా ఎప్పుడు మళ్లీ మొదలుపెట్టాలనే విషయంపై సమాధానం రావడం లేదట. దీంతో శంకర్ వేరే ప్రాజెక్టు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. `ఇండియన్-2`ను ఎప్పుడు మొదలుపెడతారో చెప్పాలని, ఆలస్యమయ్యేలా ఉంటే వేరే ప్రాజెక్టు ప్రారంభించుకుంటానని నిర్మాణ సంస్థకు శంకర్ లేఖ రాశారట. మరి, నిర్మాణ సంస్థ నుంచి శంకర్‌కు ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. 


Updated Date - 2020-10-23T21:27:20+05:30 IST

Read more