`లవ్‌స్టోరీ`కి దారేది?

ABN , First Publish Date - 2020-10-14T18:29:00+05:30 IST

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, `ఫిదా` బ్యూటీ సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం `లవ్‌స్టోరీ`

`లవ్‌స్టోరీ`కి దారేది?

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య, `ఫిదా` బ్యూటీ సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన చిత్రం `లవ్‌స్టోరీ`. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయింది. మిగిలిన కొద్ది భాగం షూటింగ్‌ను లాక్‌డౌన్ తర్వాత ప్రారంభించారు. ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాత సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. 


ఈ నెల 15 నుంచి 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లను నిర్వహించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్మాతలందరూ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే థియేటర్లు తెరిచిన వెంటనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనేది అనుమానాస్పదంగా మారింది. కరోనా కేసుల్లో ఎలాంటి తగ్గుదలా లేని నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే రిస్క్ చేయరని నిర్మాతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో `లవ్‌స్టోరీ`ని ఏ మాధ్యమంలో విడుదల చేయాలా? అని నిర్మాత ఆలోచిస్తున్నారట. డిజిటల్ లేదా థియేటర్లలో దేనిని ఎంచుకోవాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డారట. వేదిక ఏమిటనే విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నా.. క్రిసమస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మాత్రం నిర్ణయించుకున్నట్టు సమాచారం. 


Updated Date - 2020-10-14T18:29:00+05:30 IST