హీరో నాని నుంచి రైట్స్ పొందిన దిల్ రాజు

ABN , First Publish Date - 2020-05-26T04:49:09+05:30 IST

సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజు.. హీరో నాని నుంచి రైట్స్ పొందడం ఏమిటి అని అనుకుంటున్నారా? నాని కూడా ఈ మధ్య నిర్మాతగా మారి సినిమాలు

హీరో నాని నుంచి రైట్స్ పొందిన దిల్ రాజు

సక్సెస్‌ఫుల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజు.. హీరో నాని నుంచి రైట్స్ పొందడం ఏమిటి అని అనుకుంటున్నారా? నాని కూడా ఈ మధ్య నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడనే విషయం తెలిసిందే. నాని నిర్మించిన ఓ చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను దిల్ రాజు పొందినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దిల్ రాజు ఇప్పుడు తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌కి చెందిన ఓ సంస్థతో కలిసి దిల్ రాజు తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఆయన నిర్మించిన ‘ఎఫ్ 2’నే కాకుండా ‘జెర్సీ’ వంటి చిత్రాలను బాలీవుడ్ వారికి అందించేందుకు ఇప్పటికే అక్కడ దిల్ రాజు నిర్మాణం స్టార్ట్ చేశారు. 


తాజాగా ఆయన మరో సినిమాని బాలీవుడ్‌లో నిర్మించేందుకు హీరో నాని దగ్గర నుంచి రైట్స్ తీసుకున్నారట. ఇంతకీ ఏం సినిమా రైట్స్ అనేది చెప్పలేదు కదా..! ఇటీవల వచ్చిన ‘హిట్’ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులకు అందించేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రీమేక్‌లో బాలీవుడ్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై కూడా అప్పుడే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

Updated Date - 2020-05-26T04:49:09+05:30 IST