కామెడీ జోన‌ర్‌లో ధనుష్ మూవీ

ABN , First Publish Date - 2020-08-25T17:05:26+05:30 IST

నుష్‌ తాజాగా ఓ కామెడీ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇటీవల ప్రదీప్‌ రంగనాథన్‌ చెప్పిన కామెడీ కథ ధనుష్‌కు బాగా నచ్చింది.

కామెడీ జోన‌ర్‌లో ధనుష్ మూవీ

గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘కోమాళి’ సూపర్‌హిట్‌ అయ్యింది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్‌ రంగనాథన్‌ మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ధనుష్‌ తాజాగా ఓ కామెడీ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇటీవల ప్రదీప్‌ రంగనాథన్‌ చెప్పిన కామెడీ కథ ధనుష్‌కు బాగా నచ్చింది. ధనుష్‌ ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బురాజు దర్శకత్వం వహిస్తున్న ‘జగమే తంత్ర‌మ్‌’, మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘కర్ణన్‌’ చిత్రంలో నటిస్తున్నారు. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రంలోనూ నటించనున్నారు. ఈ చిత్రాలు పూర్తయిన తర్వాత ప్రదీప్‌ రంగనాథన్‌ దర్శకత్వంలో కామెడీ చిత్రంలో నటించేందుకు ధనుష్‌ సిద్ధమవుతున్నారు.

Updated Date - 2020-08-25T17:05:26+05:30 IST