ధనుష్ ‘నాన్ రుద్రన్’
ABN , First Publish Date - 2020-06-12T19:32:55+05:30 IST
ధనుష్ ఓ చార్రితక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆ చిత్రం పేరు ‘నాన్ రుద్రన్’. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
యువనటుడు ధనుష్ ‘పవర్‌పాండి’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రంలో రాజ్‌కిరణ్, ప్రసన్న, ఛాయాసింగ్ నటించారు. ధనుష్ కూడా నటించిన ఆ చిత్రం తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ధనుష్ ఓ చార్రితక చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆ చిత్రం పేరు ‘నాన్ రుద్రన్’. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు శరత్‌కుమార్, శ్రీకాంత్, ఎస్‌జే సూర్యా, నాగార్జున, అతిథిరావు కాల్షీట్లు కూడా తీసుకున్నారు. తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం నిర్మాణ పనులు చురుకుగా ప్రారంభమయ్యాయి. కానీ ధనుష్ ఇతర సంస్థలకు చెందిన చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారటంతో ‘నాన్ రుద్రన్’ షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ తొలగించిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు ధనుష్ సిద్ధమవుతున్నారు.