ధనుష్‌కు జోడీగా ..?

ABN , First Publish Date - 2020-08-04T15:46:52+05:30 IST

శింబుతో కలసి ‘మహా’ చిత్రంలో నటిస్తున్న హన్సిక, తదుపరి చిత్రంలో ధనుష్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం.

ధనుష్‌కు జోడీగా ..?

శింబుతో కలసి ‘మహా’ చిత్రంలో నటిస్తున్న హన్సిక, తదుపరి చిత్రంలో ధనుష్‌కు జోడీగా నటించనున్నట్లు సమాచారం. విజయ్‌, సూర్య, ధనుష్‌, శింబు సహా పలు నటులకు జోడీగా హన్సిక నటించారు. ఆమె ప్రస్తుతం ‘మహా’ చిత్రంలో ప్రాముఖ్యత ఉన్న కథానాయకి పాత్రలో నటిస్తున్నారు. ఇది ఆమెకు 50వ చిత్రం. ఈ చిత్రంలో శింబు అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత, మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో ధనుష్‌కు జోడీగా హన్సిక నటిస్తున్నట్లు టోలీవుడ్‌ సమాచారం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా, వారిలో హన్సిక ఒక హీరోయిన్‌ పాత్రకు అంగీకరించినట్లు సినీవర్గాల టాక్‌. హన్సిక ఇదివరకే 2011లో సురాజ్‌ దర్శకత్వంలో విడుదలైన ‘మాపిళ్లై’ చిత్రంలో ధనుష్‌కు జోడీగా నటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-04T15:46:52+05:30 IST