మూడు రోజుల్లో పది యాడ్స్‌ చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌..!

ABN , First Publish Date - 2020-09-08T20:17:25+05:30 IST

డేట్స్‌ను అడ్జస్ట్‌ చేసే భారం కూడా దీపికపైనే పడింది. ఈ కారణంగా దీపికా అండ్‌ టీం ఓ ప్రైవేట్‌ స్టూడియోలో మూడు రోజుల్లోనే పది యా....

మూడు రోజుల్లో పది యాడ్స్‌ చేస్తున్న స్టార్‌ హీరోయిన్‌..!

కరోనా వైరస్‌ ప్రభావంతో లాక్‌డౌన్‌ను విధించారు. ఈ కారణంగా సినిమా షూటింగ్స్‌ ఆగిపోవడమే కాదు.. సినిమా థియేటర్స్‌ కూడా మూతపడ్డాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని విధి విధానాలను రూపొందించి వాటిని ఫాలో అవుతూ షూటింగ్స్‌ చేసుకోవచ్చునని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే స్టార్స్ అందరూ క్రమంగా షూటింగ్స్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కమ్రంలో స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. అయితే దీపికా పదుకొనె కేవలం సినిమాలే కాదు.. యాడ్స్‌ కూడా చేస్తుంటారు. ఈ షూటింగ్స్‌ అన్నీ లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ వల్ల డిస్ట్రబ్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ డేట్స్‌ను అడ్జస్ట్‌ చేసే భారం కూడా దీపికపైనే పడింది. ఈ కారణంగా దీపికా అండ్‌ టీం ఓ ప్రైవేట్‌ స్టూడియోలో మూడు రోజుల్లోనే పది యాడ్స్‌ను షూట్‌ చేసేలా నిర్మాతలతో మాట్లాడిందట. దీపికా డేట్స్‌ ఇవ్వడమే ఆలస్యం ఇక నిర్మాతలు కామ్‌గా ఉంటారా..! వాళ్లు కూడా ఓకే అనేశారట. 


Updated Date - 2020-09-08T20:17:25+05:30 IST