సునీల్ ఇబ్బందిపడుతున్నాడా?

ABN , First Publish Date - 2020-03-08T00:42:15+05:30 IST

కమెడియన్‌గా మొదలైన సునీల్ కథానాయకుడిగా మారి కొంత కాలం ఆకట్టుకున్నాడు. అయితే ఈ 'పూల రంగడు'కి హీరోగా..

సునీల్ ఇబ్బందిపడుతున్నాడా?

కమెడియన్‌గా మొదలైన సునీల్ కథానాయకుడిగా మారి కొంత కాలం ఆకట్టుకున్నాడు. అయితే ఈ 'పూల రంగడు'కి హీరోగా వరుస పరాజయాలు ఎదురుకావడంతో ఇప్పుడు మళ్లీ నవ్వులు పండించే పనిలో పడ్డాడు. అయితే మరోమారు హాస్య నటుడిగా బిజీ కావాలనుకుంటున్న ఈ భీమవరం బుల్లోడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దీనితో లక్ కలసి రాని ఈ కమెడియన్.. "లెక్క" కూడా మారిపోయిందట. 


సునీల్ హీరోగా ఒక్కో సినిమాకి రూ.2 కోట్లను పారితోషికంగా అందుకున్నాడు. అయితే కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. ఇప్పుడు రోజువారీ పారితోషికానికి కమిటై సినిమాలు చేస్తున్నాడట. ప్రస్తుతం సునీల్ ఒకరోజు కాల్షీట్ కు రూ.2 లక్షల చార్జ్ చేస్తున్నాడట. అయితే చేతి నిండా ఆఫర్స్ లేకపోవడం, వచ్చిన సినిమాలలో కూడా పెద్దగా స్కోప్ ఉండే పాత్రలు దక్కకపోవడంతో సునీల్ఇబ్బంది పడుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. 


కమెడియన్‌గా కమ్ బ్యాక్ ఇచ్చినా పెద్దగా ఉపయోగం లేకపోవడంతో సునీల్ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాలు చేస్తున్నాడట. 'డిస్కోరాజా'లో విలన్ పాత్రలో కనిపించాడు సునీల్. నెగటీవ్ రోల్ ఈ భీమవరం బుల్లోడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈ యాక్టర్ పవన్, క్రిష్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ‘కలర్ ఫొటో’లో ఎస్సై రామరాజు అనే విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మరి రానున్న కాలంలో విలన్ కమ్, కమెడియన్ కమ్, సపోర్టింగ్ యాక్టర్‌గా సునీల్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.Updated Date - 2020-03-08T00:42:15+05:30 IST