బ్రహ్మానందం షాకింగ్ డెసిషన్

ABN , First Publish Date - 2020-07-03T03:36:40+05:30 IST

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా? ఆయన వెండితెరకు గుడ్‌బై చెప్పి, బుల్లితెరపై దర్శనమివ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు

బ్రహ్మానందం షాకింగ్ డెసిషన్

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా? ఆయన వెండితెరకు గుడ్‌బై చెప్పి, బుల్లితెరపై దర్శనమివ్వబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ మధ్య బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించిన విషయం తెలిసిందే. అవకాశాలు లేక కానివ్వండి, లేదంటే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. ఎలా చూసినా బ్రహ్మానందం ఇదివరకు ఉన్నంత యాక్టివ్‌గా అయితే లేరు. అందులో మళ్లీ కొత్త కొత్త కమెడియన్స్ వస్తుండటం కూడా బ్రహ్మానందం వెండితెరపై కనిపించకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడూ మేమే ఉండాలని కోరుకోవడం లేదని బ్రహ్మీ కూడా పలుమార్లు చెప్పి ఉన్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బ్రహ్మానందం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.


బ్రహ్మానందం సీరియల్స్‌లో నటించబోతున్నారట. ప్రస్తుతం సినిమా అవకాశాలకై వేచి చూడకుండా.. ఆడియన్స్‌కి ఏదో విధంగా దగ్గరగా ఉండాలనే బ్రహ్మానందం ఓ డైలీ సీరియల్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండేలా బుల్లితెర దర్శకులు కూడా కొన్ని కథలు బ్రహ్మీకి వినిపించారని, వాటిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బ్రహ్మీ బుల్లితెరపైకి వస్తున్నాడంటే.. ఒకరకంగా ఆయన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Updated Date - 2020-07-03T03:36:40+05:30 IST