మొన్న చరణ్.. ఇప్పుడు ఎన్టీఆర్ .. క్రేజీ ప్రాజెక్టుకు గుడ్ బై..?

ABN , First Publish Date - 2020-03-08T22:38:35+05:30 IST

యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి సీనియర్ హీరోల కాలంలో తెలుగు నాట మల్టీ స్టారర్ సినిమాలకి కొదవ ఉండేది కాదు. తరువాత కాలంలో..

మొన్న చరణ్.. ఇప్పుడు ఎన్టీఆర్ .. క్రేజీ ప్రాజెక్టుకు గుడ్ బై..?

యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ వంటి సీనియర్ హీరోల కాలంలో తెలుగు నాట మల్టీ స్టారర్ సినిమాలకి కొదవ ఉండేది కాదు. తరువాత కాలంలో ఈ ట్రెండ్‌కి ఫుల్‌స్టాప్ పడింది. అయితే ఇప్పుడిపుడే తెలుగు సినీ పరిశ్రమలో మల్టీ స్టారర్స్ హవా మొదలయింది. స్టార్ హీరోలంతా ఇగోలను దూరం పెట్టి ఒక్కటవుతుండటం పరిశ్రమకి శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించడానికి జూనియర్ నో అన్నాడట. 


యన్టీఆర్, రామ్ చరణ్ తొలిసారి 'ట్రిపుల్ ఆర్'లో నటిస్తున్నాడు. పేట్రియాట్రిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌లో కొమరం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నారు. 350 కోట్ల రూపాయిల బడ్జెట్‌తో దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా యన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ ఇచ్చిన మెగా అఫర్‌కి నో చెప్పినట్టు తెలుస్తోంది. మెగా వారసుడు రామ్ చరణ్ కూడా ఈ కారణంగానే 'డాడీ' మూవీకి దూరం అయ్యాడు. 


ఈ తరం అగ్ర కథానాయికులైన తారక్, చరణ్ మెగా ఆఫర్ వదులుకోవాల్సి రావటంతో ట్రాక్‌లో‌కి మరో టాప్ స్టార్ మహేశ్ బాబు వచ్చి చేరాడట. 'ఆచార్య'లో విద్యార్థి నాయకుడి పాత్రకి చివరికి మహేశ్‌ని వరించింది. ఈ పాత్ర కోసం 'శ్రీమంతుడి' రోజుకి కోటి పారితోషికం దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాకున్నా... సోషల్ మీడియాలో అంతా ఇదే సందడి. మరి యన్టీఆర్, రామ్ చరణ్ వదులుకున్నపాత్ర మహేశ్‌కి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూద్దాం. Updated Date - 2020-03-08T22:38:35+05:30 IST