అల్లుడి సినిమాపై అసంతృప్తి.. రంగంలోకి పరుచూరి బ్రదర్స్!

ABN , First Publish Date - 2020-02-21T22:33:30+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి తన చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రం‌పై దృష్టి సారించారు. కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న..

అల్లుడి సినిమాపై అసంతృప్తి.. రంగంలోకి పరుచూరి బ్రదర్స్!

మెగాస్టార్ చిరంజీవి తన చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తున్న చిత్రం‌పై దృష్టి సారించారు. కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సూపర్ మచ్చి’. రీసెంట్‌గా ఈ చిత్రం అవుట్ పుట్‌ను చిరంజీవి పరిశీలించారట. అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేశారట. పూర్తి కథ విన్న తర్వాతే ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. అయినా స్క్రీన్ ప్లేలో పట్టు కనిపించలేదట. దీంతో పరుచూరి బ్రదర్స్‌ను రంగంలోకి దింపారట. డైలాగులపై కూడా దృష్టి పెట్టాలని వారికి సూచించారట. నిర్మాణ పరమైన విలువల విషయంలో అసలు వెనక్కి తగ్గొద్దని నిర్మాత, దర్శకుడికి కూడా చెప్పారట. ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తనకు తెలియజేయాలని చెప్పారట. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత దిల్ రాజు చేతికి అప్పటించే యోచనలో కూడా ఉన్నారట. చిరంజీవి ఇంతలా దృష్టి పెట్టిన ఈ సినిమా కల్యాణ్ దేవ్‌కు హిట్టు ఇస్తుందేమో చూడాలి. 


కాగా ఈ మూవీని రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. నటులు రాజేంద్రప్రసాద్, నరేశ్ నటిస్తున్నారు. కల్యాణ్ దేవ్ సరసన కన్నడ నటి రచితా రామ్ నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. కల్యాణ్ దేవ్ తొలి చిత్రం ‘విజేత’ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో చిరంజీవి ఈ ‘సూపర్ మచ్చి’ సినిమాపై దృష్టి సారించారు.  

Updated Date - 2020-02-21T22:33:30+05:30 IST