బిగ్‌బాస్‌4 ఫైనల్‌కు 'మెగా' గెస్ట్‌..!

ABN , First Publish Date - 2020-12-18T15:08:48+05:30 IST

బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌ గెస్ట్‌ ఎవరనేది. మెగాస్టార్‌ చిరంజీవి లేదా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లలో ఒకరు ఫైనల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వార్తలు షికార్లు చేశాయి. అయితే...

బిగ్‌బాస్‌4 ఫైనల్‌కు 'మెగా' గెస్ట్‌..!

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌ ఎపిసోడ్‌కు సిద్ధమవుతోంది. ఈ వారం బిగ్‌బాస్‌ 4 విన్నర్ ఎవరనేది నిర్ణయిస్తారు. 16 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌కు ఐదు మంది కంటెస్టెంట్స్‌ ఎంపికయ్యారు. అభిజీత్‌, అఖిల్‌, అరియానా, హారిక, సోహైలలలో ఎవరు విజేతగా నిలుస్తారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. దీంతో పాటు అందరిలో ఆసక్తిని కలిగించిన మరో అంశం.. బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌ గెస్ట్‌ ఎవరనేది. మెగాస్టార్‌ చిరంజీవి లేదా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లలో ఒకరు ఫైనల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వార్తలు షికార్లు చేశాయి. అయితే లేటెస్ట్‌ సమాచారం మేరకు మెగాస్టార్‌ చిరంజీవి బిగ్‌బాస్‌ 4 ఫైనల్‌కు అతిథిగా రాబోతున్నారట. త్వరలోనే ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తారు. ఇదే కనుక నిజమైతే బిగ్‌బాస్‌ నాలుగు సెషన్స్‌లో రెండుసార్లు ఫైనల్‌కు వచ్చిన చీఫ్‌ గెస్ట్‌ చిరంజీవే అవుతారు మరి. 


Updated Date - 2020-12-18T15:08:48+05:30 IST