చిరు-కొరటాల సీరియస్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-02-26T15:41:38+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి 152వ చిత్రంగా

చిరు-కొరటాల సీరియస్ వార్నింగ్

మెగాస్టార్ చిరంజీవి, సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి 152వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలు రావడం, వాటిని చిత్రయూనిట్ ఖండించడం వంటి విషయాలతో ఈ చిత్రం రోజూ వార్తల్లోనే నిలుస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెట్‌లో చిరు ఉన్న లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఎవరో సెల్ ఫోన్ ద్వారా ఆ పిక్‌ను చిత్రీకరించి నెట్‌లోకి వదిలారు. ఆ పిక్ చూసిన ప్రేక్షకులు థ్రిల్లవ్వడం సంగతి పక్కన పెడితే చిత్రయూనిట్ మాత్రం చాలా ఫీలయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే చిరంజీవి లుక్‌ను అభిమానులకు స్పెషల్‌గా అందించాలని కొరటాల తాపత్రయపడితే.. ఆయనని డిజప్పాయింట్ చేసేలా ముందుగానే చిరు లుక్ లీక్ చేసేశారని ఎంతగానో ఫీలయ్యాడట. అందుకే ఇప్పుడు మేకర్స్ ఈ విషయంలో సీరియస్‌గా ఉండబోతున్నారని తెలుస్తుంది.


లీకైన పిక్ చూస్తుంటే.. ఎవరో కాదు సెట్‌లోని వారే ఆ పని చేసుంటారని భావించి, ఇకపై షూటింగ్ సెట్‌లోకి మొబైల్స్, ల్యాప్ టాప్స్ వంటి వాటికి నిషేధం విధించాలని, ఎవరైనా ఇది అతిక్రమిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చిరంజీవి, కొరటాల డిసైడ్ అయ్యారట. అయితే దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇలాంటి కండీషన్సే పెట్టి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మరి చిరు-కొరటాల ఈ విషయంలో ఎంతగా సక్సెస్ అవుతారో చూద్దాం.

Updated Date - 2020-02-26T15:41:38+05:30 IST