మెగాస్టార్ దృష్టిలో హరీష్ శంకర్?

ABN , First Publish Date - 2020-11-14T18:14:19+05:30 IST

మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా `లూసిఫర్` మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చింది.

మెగాస్టార్ దృష్టిలో హరీష్ శంకర్?

మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా `లూసిఫర్` మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చింది. ఈ సినిమా కథ తనకు సరిపోతుందని, తెలుగులో రీమేక్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమాను తెలుగు నేటివిటికీ, చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా మార్చగల దర్శకుడు దొరకడం లేదు. `సాహో` డైరెక్టర్ సుజిత్, దర్శకుడు బాబి వంటి వారు ఈ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే మెగాస్టార్‌కు అంత సంతృప్తికరంగా అనిపించలేదట. 


తనతో రెండు రీమేక్‌లు చేసి సూపర్ హిట్లు కొట్టిన దర్శకుడు వివి వినాయక్‌ను అనుకున్నారు. అయితే వినాయక్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా హరీష్ శంకర్ పేరు తెర మీదకు వచ్చింది. హరీష్ ఈ సినిమాకు న్యాయం చేయగలడని మెగాస్టార్ భావిస్తున్నారట. హరీష్ ప్రస్తుతం పవన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ `వకీల్ సాబ్`, క్రిష్ సినిమా, `అయ్యప్పనుమ్ కోషియమ్` పూర్తి చేసే సరికి చాలా సమయం పడుతుంది. ఈలోపు హరీష్ డైరెక్షన్‌లో `లూసిఫర్`ను రీమేక్ చేయాలని చిరంజీవి అనుకుంటున్నారట. త్వరలోనే హరీష్‌ను సంప్రదించబోతున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-11-14T18:14:19+05:30 IST