చెర్రీ కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్నాడా?

ABN , First Publish Date - 2020-07-03T21:28:18+05:30 IST

స్టార్ హీరోలెవరూ కొత్త దర్శకులతో కలిసి పనిచేసేందుకు పెద్దగా ఇష్టపడరు.

చెర్రీ కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేయబోతున్నాడా?

స్టార్ హీరోలెవరూ కొత్త దర్శకులతో కలిసి పనిచేసేందుకు పెద్దగా ఇష్టపడరు. అనుభవం లేని దర్శకులు భారీ బడ్జెట్ చిత్రాలను హ్యాండిల్ చేయలేరని భయపడుతుంటారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఇప్పటివరకు కొత్త దర్శకులతో కలిసి పనిచేయలేదు. అయితే త్వరలో చెర్రీ ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడట. 


ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన చెర్రీ కొత్త కథలు వింటున్నాడట. ఈ క్రమంలో సతీష్ అనే అప్‌కమింగ్ డైరెక్టర్ చెప్పిన లైన్ చెర్రీకి నచ్చిందట. పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసి తీసుకురమ్మని అతనికి చెప్పాడట. ప్రస్తుతం సతీష్ అదే పనిలో ఉన్నాడట. మరి, ఫైనల్ స్క్రిప్ట్ నచ్చితే చెర్రీ ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడేమో చూడాలి. 


Updated Date - 2020-07-03T21:28:18+05:30 IST