‘ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ లీక్‌?

ABN , First Publish Date - 2020-02-18T14:10:19+05:30 IST

‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది.

‘ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ లీక్‌?

ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్నారు. కొమురం బీమ్‌గా ఎన్టీఆర్‌.. అల్లూరి పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి కూడా తెలిసిందే. వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న ప‌ది భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజమౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. కాగా.. ‘ఆర్ఆర్ఆర్‌’లో చ‌ర‌ణ్‌, ఆలియా లుక్స్ ఇవేనంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. బ్రిటీష్ సైనికాధికారి పాత్ర‌లో చ‌ర‌ణ్‌, పాత‌కాలం చీర‌క‌ట్టులో ఆలియాభ‌ట్ క‌న‌ప‌డుతున్నారు. మ‌రి ఈ ఫొటోలు లీకుల ప‌ర్వంలో భాగంగా ఏమైనా లీక‌య్యాయా?  లేక ఎవరైనా ఫ్యాన్స్ త‌యారు చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారా? అని తెలియ‌డం లేదు. 

Updated Date - 2020-02-18T14:10:19+05:30 IST