రామ్‌చ‌ర‌ణ్ ఓకే అన్న‌ట్లేనా?

ABN , First Publish Date - 2020-07-12T01:30:01+05:30 IST

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ త‌న‌కు హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో చెర్రీ క‌లిసి ప‌నిచేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

రామ్‌చ‌ర‌ణ్ ఓకే అన్న‌ట్లేనా?

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ప్రెస్టీజియ‌స్ పాన్ ఇండియా మూవీ టిపులార్‌తో బిజీగా ఉన్నారు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఈ సినిమా త‌ర్వాత త‌న‌కు హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో చెర్రీ క‌లిసి ప‌నిచేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. వివ‌రాల మేర‌కు 2014లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘ఎవ‌డు’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్‌హిట్ట‌య్యింది. ఇప్పుడు మ‌రోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుంద‌ట‌. వంశీ పైడిప‌ల్లి ఇటీవ‌ల చ‌ర‌ణ్‌ను క‌లిసి మెయిన్ క‌థ చెప్పి ఓకే చేయించుకున్నార‌ట‌. ట్రిపులార్ సినిమా త‌ర్వాత ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌హేశ్ 27వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేయాల్సింది కానీ.. చివ‌రి నిమిషంలో మ‌హేశ్ వ‌ద్ద‌న‌డంతో వంశీ ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ని సోష‌ల్ మీడియాలో టాక్‌. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Updated Date - 2020-07-12T01:30:01+05:30 IST