హారర్ కంటెంట్‌తో చైతన్య!!
ABN , First Publish Date - 2020-08-25T20:24:57+05:30 IST
అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. థాంక్యూ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా హారర్ కంటెంట్‌తో తెరకెక్కనుందట. ఇప్పటి వరకు చైతన్య చేసిన సినిమాలేవీ ఇలాంటి జోనర్‌లో రూపొందలేదు. నిజానికి హారర్ సినిమాలంటే భయమని, ఆ జోనర్ సినిమాలను చూడటానికి ఆయన ఇష్టపడనని చైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆయన హారర్ సినిమా చేయనున్నారనే వార్తలు వినిపించడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ మరి చైతన్యను ఏ మాయ చేశాడో తెలియాలంటే వెయిటింగ్ తప్పదు.
Read more