బడ్జెట్‌పై తర్జన భర్జన.. బోయపాటి-బాలయ్య సినిమా ఆలస్యం?

ABN , First Publish Date - 2020-02-18T22:59:25+05:30 IST

దర్శకుడు బోయపాటి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం బడ్జెట్‌పై...

బడ్జెట్‌పై తర్జన భర్జన.. బోయపాటి-బాలయ్య సినిమా ఆలస్యం?

దర్శకుడు బోయపాటి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం బడ్జెట్‌పై తర్జన భర్జన కొనసాగుతోంది. ఈ మూవీ బడ్జెట్ రూ.70 కోట్లు అవుతుందని దర్శకుడు బోయపాటి నిర్మాతకు తేల్చి చెప్పారట. అందుకు నిర్మాత ఒప్పుకోవడంలేదట. రూ.40 కోట్లలోపే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని కండీషన్స్ పెట్టారట. ఇంత తక్కువ బడ్జెట్‌తో అయితే చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు అనుకున్నట్లు రావని, క్వాలిటీ కావలంటే పూర్తి బడ్జెట్ తప్పదని బోయపాటి చెప్పారట. చివరకు కొన్ని కండీషన్స్‌తో నిర్మాత ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై దర్శకుడు కానీ, నిర్మాత గానీ స్పష్టత ఇవ్వలేదు. కాగా బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు విజయం సాధించాయి. దీంతో ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

Updated Date - 2020-02-18T22:59:25+05:30 IST