మహేశ్‌ సినిమాలో మరో బాలీవుడ్‌ స్టార్‌..!

ABN , First Publish Date - 2020-09-16T15:23:23+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌ లేటెస్ట్‌ మూవీ 'సర్కారువారి పాట' మొదటి షెడ్యూల్‌ త్వరలోనే అమెరికాలో ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

మహేశ్‌ సినిమాలో మరో బాలీవుడ్‌ స్టార్‌..!

సూపర్‌స్టార్‌ మహేశ్‌ లేటెస్ట్‌ మూవీ 'సర్కారువారి పాట' మొదటి షెడ్యూల్‌ త్వరలోనే అమెరికాలో ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ హంగామా పెరగనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ చిత్రంలో అనీల్‌ కపూర్‌ విలన్‌గా నటిస్తారని వార్తలు వినిపించాయి. లేటెస్ట్‌ సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్‌ కూడా నటించనున్నారట. ఆ బాలీవుడ్ స్టార్‌ ఎవరో కాదు.. విద్యాబాలన్‌. ప్రస్తుతం యూనిట్‌ విద్యాబాలన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఆమె ఓకే అంటే.. మహేశ్‌ సోదరి పాత్రలో విద్యాబాలన్‌ కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇది వరకు విద్యాబాలన్‌ తెలుగులో 'యన్‌.టి.ఆర్' చిత్రంలో బసవతారకమ్మ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేశ్‌ సినిమాలో నటించడానికి ఓకే చెబితే ఆమె నటించే రెండో టాలీవుడ్ మూవీ ఇదే అవుతుంది. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజుల పాటు వెయిట్‌ తప్పదు. 


Updated Date - 2020-09-16T15:23:23+05:30 IST