వరుణ్ సరసన బాలీవుడ్ భామ?

ABN , First Publish Date - 2020-02-21T17:24:17+05:30 IST

గతేడాది `ఎఫ్-2` `గద్దలకొండ గణేష్` వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్

వరుణ్ సరసన బాలీవుడ్ భామ?

గతేడాది `ఎఫ్-2` `గద్దలకొండ గణేష్` వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `బాక్సర్`. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అల్లు బాబి, సందీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో వరుణ్ బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు.


ఈ సినిమాలో వరుణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ భామను తీసుకున్నారట. పలు తెలుగు సినిమాల్లో నటించిన మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందట. ఈమె ఇటీవలె సల్మాన్‌ఖాన్ `దబాంగ్-3`లో నటించింది. ఈమెను `బాక్సర్`లో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందట. 

Updated Date - 2020-02-21T17:24:17+05:30 IST