ప్ర‌భాస్ లిస్టులో మ‌రో బాలీవుడ్ భామ‌..?

ABN , First Publish Date - 2020-04-25T19:08:00+05:30 IST

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ‘మ‌హాన‌టి’ ఫేమ్‌ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర‌లో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా క‌రోనా ప్ర‌భావంతో ఆల‌స్య‌మ‌య్యేలా క‌న‌ప‌డుతుంది.

ప్ర‌భాస్ లిస్టులో మ‌రో బాలీవుడ్ భామ‌..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ‘మ‌హాన‌టి’ ఫేమ్‌ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర‌లో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా క‌రోనా ప్ర‌భావంతో ఆల‌స్య‌మ‌య్యేలా క‌న‌ప‌డుతుంది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఫిబ్రవ‌రిలో స్టార్ట్ అవుతుంద‌ని టాక్‌. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఇందులో బాలీవుడ్ హీరోయిన్‌ను న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ముందుగా చిత్ర యూనిట్ దీపికా ప‌దుకొనెను సంప్ర‌దించార‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ తాజా స‌మాచారం మేరకు కియారా అద్వానీని న‌టింప చేయడానికి సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. మ‌రి చివ‌ర‌గా ప్ర‌భాస్ స‌ర‌స‌న ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారో చూడాలి. 

Updated Date - 2020-04-25T19:08:00+05:30 IST