బాలీవుడ్ విల‌న్‌ని ఢీ కొట్ట‌నున్న ప‌వ‌న్‌..!

ABN , First Publish Date - 2020-02-27T17:57:07+05:30 IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు.

బాలీవుడ్ విల‌న్‌ని ఢీ కొట్ట‌నున్న ప‌వ‌న్‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న `పింక్‌` రీమేక్‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని టాక్‌. లేటెస్ట్ స‌మాచారం పీరియాడిక‌ల్ క‌థాంశంతో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నార‌ని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. 


Updated Date - 2020-02-27T17:57:07+05:30 IST