నితిన్ రీమేక్‌లో బాలీవుడ్ న‌టి..?

ABN , First Publish Date - 2020-06-10T23:41:02+05:30 IST

ఈ ఏడాది ‘భీష్మ’‌తో హిట్ కొట్టిన నితిన్ వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. నితిన్ చేయాల్సిన చిత్రాల్లో బాలీవుడ్ చిత్రం ‘అందాదున్’ రీమేక్ ఒక‌టి.

నితిన్ రీమేక్‌లో బాలీవుడ్ న‌టి..?

ఈ ఏడాది ‘భీష్మ’‌తో హిట్ కొట్టిన నితిన్ వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. నితిన్ చేయాల్సిన చిత్రాల్లో బాలీవుడ్ చిత్రం ‘అందాదున్’ రీమేక్ ఒక‌టి. మేర్ల‌పాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నాని ‘గ్యాంగ్ లీడ‌ర్’ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘అందాదున్’ చిత్రంలో టబు చేసిన కీల‌క పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ లిస్టులో టబు స‌హా అన‌సూయ‌, ర‌మ్య‌కృష్ణ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డ్డాయి. తాజాగా ఈ లిస్టులో మ‌రో బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి పేరు విన‌ప‌డుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

Updated Date - 2020-06-10T23:41:02+05:30 IST