బిగ్‌బాస్ 4 ఎప్పుడంటే ..?
ABN , First Publish Date - 2020-05-26T16:12:34+05:30 IST
పాపులర్ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుందని కూడా వార్తలు వినపడుతున్నాయి.

కరోనా ప్రభావంతో ఆగిన షూటింగ్‌లు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ విషయమై సినీ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పాపులర్ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 త్వరలోనే ప్రారంభం కానుందని కూడా వార్తలు వినపడుతున్నాయి. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం కాబోయే ఈ రియాలిటీ షో మూడో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అక్కినేని నాగార్జునే నాలుగో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట. జూలై చివరలో లేదా ఆగస్ట్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.