బాలయ్య సినిమాలో ఆ ఇద్దరూ..?

ABN , First Publish Date - 2020-11-03T15:17:51+05:30 IST

నటరత్న నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

బాలయ్య సినిమాలో ఆ ఇద్దరూ..?

నటరత్న నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `సింహా`, `లెజెండ్` వంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట.


ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఈమెకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు కూడా ఛాన్సుందట. ఆ పాత్రకు హీరోయిన్ పూర్ణను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు చిన్న సినిమాలు మాత్రమే చేసిన పూర్ణకు ఇది బంపరాఫర్ అనే చెప్పాలి. 

Updated Date - 2020-11-03T15:17:51+05:30 IST