బాలకృష్ణ వద్దన్నదే గోపీచంద్ కావాలన్నాడా?

ABN , First Publish Date - 2020-06-10T22:52:16+05:30 IST

చిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరోకి నచ్చని కథ మరో హీరోకి బాగా నచ్చవచ్చు. ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీనే...

బాలకృష్ణ వద్దన్నదే గోపీచంద్ కావాలన్నాడా?

చిత్ర పరిశ్రమలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరోకి నచ్చని కథ మరో హీరోకి బాగా నచ్చవచ్చు. ఒకరు రిజెక్ట్ చేసిన స్టోరీనే.. మరొకరు ఏరికోరి ఎంచుకునే సందర్భాలూ ఉంటాయి. టాలీవుడ్‌లో బాలకృష్ణ – గోపీచంద్ విషయంలో అదే జరిగిందట. బాలకృష్ణ గత చిత్రం ‘రూలర్’ స్టోరీని ముందుగా గోపీచంద్‌కు వినిపించాడట పరుచూరి మురళి. అప్పటికే గోపీచంద్‌తో మురళి ‘ఆంధ్రుడు’ తీశాడు. అయితే ఆ యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టు ‘రూలర్’ను గోపీచంద్ రిజెక్ట్ చేశాడట. అదే కథను తన ‘అధినాయకుడు’ హీరో బాలయ్యకు వినిపించడం.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ ‘రూలర్’ చెయ్యడం చకాచకా జరిగిపోయాయి.


కట్ చేస్తే బాలకృష్ణ వద్దనుకున్నకథను గోపీచంద్ ఏరికోరి చేయబోతుండడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విషయానికి వస్తే బాలకృష్ణ కోసం డైరెక్టర్ తేజ ‘అలివేలు వెంకటరమణ’ అనే కథను సిద్ధం చేశాడట. బాలయ్యకి ఆ స్టోరీ నచ్చలేదట. ఆ సినిమా చెయ్యకపోయినా.. తేజాకి ‘యన్.టి.ఆర్’ బయోపిక్ చేసే అరుదైన అవకాశాన్ని అందించాడు నటసింహ. కానీ.. ముహూర్తం పూర్తయిన తర్వాత ‘యన్.టి.ఆర్’ బయోపిక్ నుంచి తేజ తప్పుకున్నాడు. అయితే.. అప్పట్లో బాలయ్య వద్దన్న ‘అలివేలు వెంకటరమణ’ను ఇప్పుడు గోపీచంద్‌తో తీయబోతున్నాడు తేజ. తనను ‘జయం’తో నటుడిగా నిలబెట్టిన తేజతో ‘అలివేలు వెంకటరమణ’ ప్రాజెక్టు చేయడానికి గోపీచంద్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా బాలకృష్ణ-గోపీచంద్ మధ్య కథల తారుమారు జరిగిందన్నమాట. బాలకృష్ణ వద్దనుకున్న కథతో ఇప్పుడు గోపీచంద్ ఎలాంటి ఫలితం చూస్తాడో మరి!  

Updated Date - 2020-06-10T22:52:16+05:30 IST