హిట్‌ చిత్రాల దర్శకుడితో బాలయ్య మూవీ ఫిక్సయిందట

ABN , First Publish Date - 2020-12-24T03:36:51+05:30 IST

నందమూరి అభిమానులను కొన్నాళ్లుగా ఊరిస్తున్న బాలకృష్ణ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లేటెస్ట్ గా ఫిక్సైనట్టు ఫిల్మ్ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. బాలయ్య-అనిల్ కాంబోలో సినిమాని

హిట్‌ చిత్రాల దర్శకుడితో బాలయ్య మూవీ ఫిక్సయిందట

నందమూరి అభిమానులను కొన్నాళ్లుగా ఊరిస్తున్న బాలకృష్ణ - అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లేటెస్ట్ గా ఫిక్సైనట్టు ఫిల్మ్ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది. బాలయ్య-అనిల్ కాంబోలో సినిమాని నిర్మించడానికి దిల్ రాజు ప్రయత్నాలు ఫలించాయట. మరోవైపు.. నటసింహతో సినిమాకోసం 'ఎఫ్-3'ని శరవేగంగా పూర్తిచేయబోతున్నాడట అనిల్ రావిపూడి. బోయపాటితో చేస్తున్న సినిమా పూర్తైన తర్వాత బాలకృష్ణ చేయబోయే తర్వాతి చిత్రం ఏంటి? ఇదే నందమూరి అభిమానులను ఊరిస్తున్న ప్రశ్న. అయితే.. నటసింహ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసిందనేది ఫిల్మ్ నగర్ టాక్. 'బీబీ3' తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. ఇప్పటికే బాలయ్యకి.. అనిల్ ఓ పవర్ ఫుల్ సబ్జెక్టు వినిపించడం.. దానికి నటసింహ ఓకే చెప్పడం జరిగిందని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక.. బాలకృష్ణ-అనిల్ క్రేజీ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో మ్యాగ్జిమమ్‌ స్టార్స్ ను కవర్ చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు విష్ లిస్ట్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడట. ఇప్పుడు.. బాలకృష్ణ- అనిల్ రావిపూడి సినిమాతో ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఆ కోరికను నెరవేర్చుకోవాలనుకుంటున్నాడట. 'ఎఫ్-3' తర్వాత అనిల్ రావిపూడి.. బాలకృష్ణ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట.


ఇటీవలే ముహూర్తం జరుపుకున్న 'ఎఫ్-2' సీక్వెల్ 'ఎఫ్-3' బుధవారం నుంచి పట్టాలెక్కింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక ఇంటి సెట్ లో తొలి షెడ్యూల్ ని మొదలుపెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ షెడ్యూల్ లో వెంకటేశ్ పాల్గొంటున్నాడు. తదుపరి షెడ్యూల్ నుంచి వరుణ్ తేజ్ కూడా 'ఎఫ్-3' టీమ్ తో జాయిన్ కానున్నాడట. ఇక.. ఈ సినిమా 'ఎఫ్-2'కి సీక్వెల్ గా చెప్పబడుతున్నా.. 'ఎఫ్-3' ఆద్యంతం కొత్త కథతో రూపొందుతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు అనిల్. ఇక.. 'ఎఫ్-3'ని శరవేగంగా పూర్తి చేసి.. వేసవి బరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడట నిర్మాత దిల్ రాజు. మొత్తంమీద.. తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉన్న అనిల్ రావిపూడి.. 'ఎఫ్-3'తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Updated Date - 2020-12-24T03:36:51+05:30 IST