క‌వ‌ల‌లుగా బాల‌కృష్ణ‌

ABN , First Publish Date - 2020-02-26T02:38:07+05:30 IST

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది.

క‌వ‌ల‌లుగా బాల‌కృష్ణ‌

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో మూడో సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుండి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నార‌ని.. అందులో ఒక పాత్ర అఘోరాగా క‌న‌ప‌డుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో బాల‌కృష్ణ క‌వ‌ల‌లుగా క‌న‌ప‌డ‌బోతున్నారు. అప్పుడెప్పుడో రాముడు భీముడు, అపూర్వ స‌హోదరులు చిత్రంలో క‌వ‌ల‌లుగా న‌టించిన బాల‌కృష్ణ క‌వ‌ల‌లుగా క‌నిపించ‌లేద‌ని చెప్పాలి. చాలా ఏళ్ల త‌ర్వాత బాల‌కృష్ణ ..క‌వ‌ల‌లుగా క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. 


క‌వ‌ల‌ల్లో చిన్న‌ప్పుడే ఇద్ద‌రూ విడిపోతార‌ట‌. ఒక‌రు వార‌ణాసిలో..మ‌రొక‌రు అనంత‌పూర్‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. వార‌ణాసిలో పెరిగిన అఘోరా బాల‌కృష్ణ పాత్ర ఇంట‌ర్వెల్‌లో ఎంట్రీ ఇస్తుంద‌ట‌. శ్రియా శ‌ర‌న్‌, అంజ‌లి హీరోయిన్స్‌గా న‌టిస్తార‌ట‌. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

Updated Date - 2020-02-26T02:38:07+05:30 IST