డైరెక్టర్‌గా మారుతున్న ఆర్ట్ డైరెక్టర్..?
ABN , First Publish Date - 2020-08-08T19:08:36+05:30 IST
దర్శకుడు కావాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారిలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఒకరు.

దర్శకుడు కావాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారిలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఒకరు. ఆయన నేరుగా ఎక్కడా చెప్పకపోయినా ఆయన డైరెక్టర్ కావాలనుకునే విషయం ఆయన మాటల్లో తెలిసిపోతుంటుంది. అయితే ఆయన కోరిక త్వరలోనే తీరనుందని ఫిలింనగర్ సర్కిల్స్ సమాచారం. వివరాల మేరకు డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను , కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ముందుండే ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఆర్ట్ డైరెక్టర్ రవీందర్‌ను డైరెక్టర్‌గా పరిచయం చేయనుందట. రవీందర్ ఓ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించనున్నారని టాక్. ప్రస్తుతం ఈయన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.