చైతును డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ యాక్టర్‌..?

ABN , First Publish Date - 2020-10-30T18:18:22+05:30 IST

చైతన్య మరో కొత్త సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే...

చైతును డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ యాక్టర్‌..?

ఇప్పటికే శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్‌స్టోరి' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న నాగచైతన్య తదుపరి విక్రమ్ కుమార్‌ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కాగా.. చైతన్య మరో కొత్త సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే నాగచైతన్యను ఓ సీనియర్‌ హీరో డైరెక్ట్‌ చేయబోతున్నారట. ఇంతకూ ఈ సీనియర్‌ హీరో ఎవరో కాదు.. అర్జున్‌ సారా. తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్‌. ఇది వరకు కొన్ని సినిమాలను అర్జున్‌ డైరెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తొలిసారి ఓ టాలీవుడ్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేయనున్నాడు అర్జున్‌. రీసెంట్‌గా అర్జున్‌ చెప్పిన పాయింట్‌ నచ్చడంతో చైతన్య సినిమా చేయడానికి రెడీ అన్నారని సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 


Updated Date - 2020-10-30T18:18:22+05:30 IST