ప్రభాస్ కోసం ఏఆర్ రెహమాన్

ABN , First Publish Date - 2020-05-26T23:45:04+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రభాస్ ప్రస్తుతం

ప్రభాస్ కోసం ఏఆర్ రెహమాన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకి లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రజంట్ కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ సినిమాకు ముందు సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని ( చిరంజీవి ‘సైరా’ చిత్ర సంగీత దర్శకుడు) అనుకున్నారు. కానీ అమిత్ త్రివేది ఈ చిత్రానికి వర్క్ చేయడం లేదని తెలపడంతో మరోసారి ‘సాహో’ సంగీతం విషయంలో జరిగిందే రిపీట్ అవుతుందా? అని అభిమానులు కొద్దిరోజులుగా నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్‌ని టార్గెట్ చేస్తున్నారు. 


‘సాహో’ విషయంలో కూడా ముందు అనుకున్న వారిని పక్కన పెట్టి.. పాటకొక మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకొచ్చారు. ‘సాహో’కి ఉన్న మైనస్‌లలో మ్యూజిక్ కూడా ఒకటని అందరూ అప్పట్లో తేల్చి చెప్పారు. ఇప్పుడు చేస్తున్న చిత్రానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మేకర్స్ ఈ చిత్రం కోసం లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను దించబోతున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ తెలుగులో ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసి ఉన్నారు. పవన్ ‘కొమరం పులి’, మహేష్ ‘నాని’ చిత్రాలకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమానే. ఆ సినిమాలు ఆడకపోయినా.. రెహమాన్ సంగీతానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరిప్పుడు ప్రభాస్ చిత్రంతో మరోసారి రెహమాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనేది టాక్. అయితే అధికారికంగా మాత్రం ఇంకా బయటికి రాలేదు. ప్రభాస్ అభిమానులు కూడా గొడవ చేస్తుంది ఇటువంటి అప్‌డేట్ కోసమే. మరి ఇప్పటికైనా మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.

Updated Date - 2020-05-26T23:45:04+05:30 IST