'నిశ్శబ్దం'కు అనుష్క ఫస్ట్‌ ఛాయిస్‌ కాదా..!

ABN , First Publish Date - 2020-09-20T19:29:44+05:30 IST

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిశ్శబ్దం'. అయితే అనుష్క ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ కాదట...

'నిశ్శబ్దం'కు అనుష్క ఫస్ట్‌ ఛాయిస్‌ కాదా..!

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిశ్శబ్దం'. టీజీ విశ్వప్రసాద్‌, కోన వెంకట్‌ నిర్మాతలు. ఏప్రిల్‌ 2న విడుదల చేద్దామనుకున్న సినిమా థియేటర్స్‌ లేకపోవడంతో అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతుంది. ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని) పాత్రలో నటించింది. ఇలాంటి ఛాలెంజింగ్‌ రోల్‌ను బేస్‌ చేసుకుని రాసుకున్ కథకు ముందుగా అనుష్కను హీరోయిన్‌గా అనుకోలేదు. ఇటు దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితురాలైన తాప్సీ అయితే సినిమాకు బాగా మైలేజ్‌ వస్తుందని మేకర్స్‌ భావించారట. కానీ.. తాప్సీ ఫుల్‌ బిజీగా ఉండటంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేనని చెప్పేసిందట. ఆ సమయంలో కోన వెంకట్‌ హైదరాబాద్‌ వస్తున్న ఓ విమానంలో అనుష్కను చూడటం, విమానంలో కథ చెప్పడం జరిగింది. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత అనుష్క సినిమా చేస్తానని ఓకే చెప్పడంతో సినిమా ముందుకు కదలింది. 


Updated Date - 2020-09-20T19:29:44+05:30 IST