కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ABN , First Publish Date - 2020-08-25T14:35:55+05:30 IST

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ‘మీ టూ’ అనే ఉద్య‌మ‌మే మొద‌లైంది. చాలా మంది త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. అయితే ఈ మ‌ధ్య కాస్టింగ్ కౌచ్ వివాదం చల్లబడ్డట్టే కనిపిస్తుంది. కానీ.. అక్కడక్కడా దీనికి సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనూ కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని, ఇందులో సీక్రెట్ ఏమీ లేద‌ని తెలిపారు అనుష్క‌. తాను కూడా కాస్టింగ్ కౌచ్ వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డాను.. కానీ ముక్కుసూటిగా, ధైర్యంగా మాట్లాడ‌టం వ‌ల్ల ఆ స‌మ‌స్య‌ను త‌ప్పించుకోగ‌లిగానని జేజెమ్మ చెప్పిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. 

Updated Date - 2020-08-25T14:35:55+05:30 IST