‘కార్తికేయ 2’ నుండి అనుప‌మ ఔట్‌..!

ABN , First Publish Date - 2020-06-05T14:32:36+05:30 IST

హీరో నిఖిల్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒక‌టి. చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చిత్ర‌మిది.

‘కార్తికేయ 2’ నుండి అనుప‌మ ఔట్‌..!

హీరో నిఖిల్‌కు బ్రేక్ ఇచ్చిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒక‌టి. చందు మొండేటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చిత్ర‌మిది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమా నుండి త‌ప్పుకుంద‌ట‌. త‌న పాత్ర‌కు అంత ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో అనుప‌మ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ద‌ర్శ‌క నిర్మాత‌లిప్పుడు మ‌రో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో బిజీగా ఉన్నార‌ట‌. 

Updated Date - 2020-06-05T14:32:36+05:30 IST