రీమేక్‌లో అనుప‌మ‌..!!

ABN , First Publish Date - 2020-04-20T17:32:55+05:30 IST

బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం ‘ప్రేమ‌మ్‌’తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అనుపమ మలయాళ చిత్ర సీమ నుండి తెలుగులోకి ‘అఆ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు.

రీమేక్‌లో అనుప‌మ‌..!!

బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం ‘ప్రేమ‌మ్‌’తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన అనుపమ మలయాళ చిత్ర సీమ నుండి తెలుగులోకి ‘అఆ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. క్ర‌మంగా తెలుగు చిత్రాల్లో ఎక్కువ‌గా న‌టిస్తున్నారు. 2019లో న‌టించిన ‘రాక్ష‌సుడు’  సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. ఈ ఏడాదిలో మలయాళ, తమిళ చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది. ఈ ఏడాదిన ఇంత వరకు తెలుగు సినిమాలో నటించనే లేదు. అయితే త్వరలోనే అనుపమ ఓ మలయాళ రీమేక్‌లో నటించనుందని సినీ వర్గాల సమాచారం. మలయాళంలో విజయవంతమైన హెలెన్ సినిమా తెలుగు రీమేక్ హక్కులను నిర్మాత పివిపి దక్కించుకున్నారట. ఈ రీమేక్‌లో అనుపమ నటించనుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. 

Updated Date - 2020-04-20T17:32:55+05:30 IST