క‌మ‌ల్‌హాస‌న్ విలన్‌ ఖ‌రారు!!

ABN , First Publish Date - 2020-12-08T13:39:34+05:30 IST

కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో విలన్‌గా మలయాళ నటుడు ఫాహిద్ ఫాజిల్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

క‌మ‌ల్‌హాస‌న్ విలన్‌ ఖ‌రారు!!

ఒక‌వైపు రాజకీయాలు, మ‌రో వైపు సినిమాల‌ను యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ బ్యాలెన్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం క‌మ‌ల్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ అనే సినిమాను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రం, ఖైది చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న లోకేశ్ క‌న‌క‌రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈయ‌న తెర‌కెక్కించిన మ‌రో చిత్రం మాస్ట‌ర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ టైటిల్ పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. లోకేశ్ డైరెక్ట్ చేస్తున్న నాలుగో చిత్రం విక్ర‌మ్‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇందులో మ‌ల‌యాళ న‌టుడు ఫాహిద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ట‌. ఫాహిద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించడం కొత్తేమీ కాక‌పోయినా క‌మ‌ల్ వంటి హీరో సినిమాలో ఫాహిద్ న‌టించ‌డం త‌న‌కు కూడా ఓ కొత్త ఎక్స్‌పీరియెన్సేన‌ని చెప్పొచ్చు. 

Updated Date - 2020-12-08T13:39:34+05:30 IST